telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన న్యూడ్ ఫోటోలను తానే పోస్ట్ చేసి… హ్యాకర్లకు షాకిచ్చిన హీరోయిన్

Bella-Throne

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే అరచేతుల్లో అమరిపోయింది. ఏం కావాలన్నా… ఏం చేయాలన్నా క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ టెక్నాలజీని వారి అవ‌స‌రాలు తీర్చుకోవ‌డానికి మరో పద్ధతిలో ఉపయోగిస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ న‌టి బెల్లా థ్రోన్ ఫోన్‌ను కొంద‌రు ఆక‌తాయిలు హ్యాక్ చేశారు. ఆమె న్యూడ్ ఫోటోల‌ను డౌన్ లోడ్ చేసుకుని ఆమెను బెద‌రించ‌డం మొద‌లు పెట్టారు. వారి అవ‌స‌రం తీర్చ‌కుంటే ఆ ఫోటోల‌ను నెట్‌లో అప్‌లోడ్ చేస్తామ‌ని బెదిరించారు. దీంతో బాగా ఆలోచించిన ఆమె చివ‌ర‌కు ధైర్యం చేసి స‌ద‌రు హ్యాక‌ర్స్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ అమ్మ‌డు త‌న న్యూడ్ ఫోటోల‌ను హ్యాకర్స్ కంటే ముందుగా తనే స్వయంగా త‌న ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో బెల్లా థ్రోన్ చేసిన ప‌నికి షాక్ అవ‌డం హ్యాకర్స్ వంతైంది. బెల్లా థ్రోన్ న్యూడ్ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఇంకేముంది ఆమె చేసిన పనికి హ్యాకర్ల దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.

Related posts