telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆ రోజు పార్టీలో… వీడియో వైరల్

Disha

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారింది. ఇప్పటికే అతని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి? అంతకుముందు ఏం జరిగింది? అనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఈ కేసు విషయమై సీబీఐ, ఈడీ కూడా ఎంటరై ఎంక్వైరీలు మొదలు పెట్టాయి. సుశాంత్ మరణానికి సరిగ్గా 5 రోజుల ముందు అనగా జూన్ 8న రాత్రి మలాద్లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆయన మాజీ మేనేజర్ దిశ సూసైడ్ చేసుకుంది. ఈ వెంటనే సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సెన్సేషన్ అవుతోంది. దిశ ఆత్మహత్యకు ముందురోజు తన ప్రియుడు రోహాన్‌ నివాసంలో జ‌రిగిన పార్టీలో ఆమె హుషారుగా పాల్గొన్న విషయానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడం, ఇందులో దిశ ప్రియుడు రోహాన్‌ సహా మరికొందరు స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. ఇక ఇదిలా ఉండగానే దిశా సలియన్ డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవల మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. దీంతో తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన పోలీసులు అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేశారు. దిశ ఆత్మహత్య ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచ‌నామా చేసినట్లు డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ తేల్చి చెప్పారు.

Related posts