telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది: కృష్ణయ్య

BC President R. Krishnaiah BC Reservations

ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో డబ్బులు లేని బీసీలు గెలిచే పరిస్థితి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ డిమాండ్ల సాధనకు శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదించి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్‌ కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని అన్నారు. అన్ని రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని, దేశ జనాభాలో 52% ఉన్న బీసీలకు చట్టసభల్లో 14% ప్రాతినిథ్యం కూడా లేకపోవడం శోచనీయమన్నారు.

దేశంలోని 29 రాష్ట్రాలుంటే 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా లేరని తెతలిపారు. గవర్నర్లు, బ్యాంకుల చైర్మన్లు, కేంద్ర కార్యదర్శుల్లో 98 శాతం అగ్రవర్ణాల వారే ఉన్నారని, ఇతర ఉన్నత స్థాయి పోస్టుల్లో 80 శాతం ఉన్నారని వివరించారు. ఆర్థిక వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి ఒక్క రోజులో ఆమోదించారని, కానీ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా బీసీ బిల్లు గురించి ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. గొర్రెలు, బర్రెలు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వతంగా బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు.

Related posts