పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు నమోదు చేసింది.
రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘనవిజయం సాధించారు. 34,049 ఓట్ల మెజారిటీతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను చిత్తుగా ఓడించారు.
మొత్తం 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం జనసేన అభ్యర్థి బలరామకృష్ణకు 1,05,995 ఓట్లు రాగా… వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాకు 71,946 ఓట్లు మాత్రమే వచ్చాయి.