telugu navyamedia
తెలంగాణ వార్తలు

పీపుల్స్ ప్లాజాలో అంగరంగా వైభవంగా బతుకమ్మ సంబురాలు

మన రాష్ట్ర ప్రత్యేక ప్రసిద్ది, భారత దేశ కీర్తి, రాష్ట్ర ప్రశస్తిని సాంస్కృతిక విశిష్టతను పెంపొందించే మహిళ పండుగ బతుకమ్మ. సమాజంలో మహిళ ప్రాధాన్యత గౌరవాన్ని చాటి చెప్పే పండుగ జిహెచ్ఎంసి అధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద ఆకర్షణగా నిలిచింది.

వారితో పాటు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ ఛైర్మెన్ సునీత లక్ష్మ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఏమ్మెల్సీ వాణి దేవి, దేవానంద్ మహిళా కార్పొరేట్లు పాల్గొని తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను వెలిగెత్తి చాటారు. బతుకమ్మ ఆటపాటలతో అలరించారు.


ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయ లక్ష్మి మాట్లాడుతూ… జిహెచ్ఎంసి అధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు విజయవంతమైనట్లు తెలిపారు. బతుకమ్మకు దేశ విదేశాల్లో అంబాసిడర్ గా నిలిచిన కల్వకుంట్ల కవితక్క రావడం వేడుకలకు శోభ వచ్చింది అదే విధంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ ఛైర్మెన్ సునీత లక్ష్మ రెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, తోటి మహిళ కార్పొరేట్లు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచిన బతుకమ్మ పిలవగానే వచ్చి విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుకలను నిర్వహించడం జరిగిందని అన్నారు.

డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో ప్రతి మహిళకు ఇష్టమైన పండుగ అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చి ఆనందోత్సవాలతో జరుపుకునే మహిళ ప్రత్యేక పండుగ దేశ విదేశాల్లో తెలంగాణ సంస్కృతినీ చాటిచెప్పిన ఎమ్మెల్సి కవితక్క ఈ వేడుకలకు రావడం మహిళ కార్పొరేటర్ల సంతోష దాయకమన్నారు.

ఈ సందర్భంగా టిఎస్ఎస్ కళాకారులు గోవిందా చారి అధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.

Related posts