telugu navyamedia
ట్రెండింగ్

బసంత్ కుమార్ బిర్లా .. మృతి..

basanth kumar biral 98 died

బీకే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బసంత్ కుమార్ బిర్లా (98) ముంబైలో కన్నుమూశారు. బిర్లా మృతిపై వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కాగా, బీకే బిర్లాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. బిర్లా కుమారుడు ఆదిత్య విక్రం బిర్లా 1995లో మృతి చెందారు. 1921 జనవరి 12న బీకే బిర్లా జన్మించారు.

దేశంలో పేరు గాంచిన బీకే బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ బీకే బిర్లా నేతృత్వంలోనే ఏర్పాటైంది. ఇండో-ఇథియోపియన్ టెక్స్ టైల్స్ షేర్ కంపెనీని స్థాపించిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తగా బీకే బిర్లా గుర్తింపు పొందారు. పత్తి, సిమెంట్, ఫ్లైఉడ్, పేపర్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్, పేపర్ షిప్పింగ్, టీ, కాఫీ మొదలైన రంగాల్లో ఆయన వ్యాపారాలు నిర్వహించారు. కృష్ణార్పణ్ చారిటీ ట్రస్టు, పలు విద్యా సంస్థలకు ఆయన అధినేతగా వ్యవహరించారు. పలు వ్యాపారాలే కాకుండా మంచి విద్యావేత్తగా బీకే బిర్లాకు పేరు.

Related posts