telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

 భర్తతో గిన్నెలు తోమించిన శ్రియ… అల్లు అర్జున్ కి ఛాలెంజ్‌

SREYA

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరో హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలాగే, ఆరోగ్య సూత్రాలను కూడా సూచిస్తున్నారు. ఈ సమయంలో తాము ఇళ్లలో ఏం చేస్తున్నామో చూపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ శ్రియ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. తన భర్త అండ్రీ కొస్చీవ్ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న వీడియోను శ్రియ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘వంట పాత్రలను శుభ్రం చేయండి’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఛాలంజ్‌ను స్వీకరించాల్సిందిగా తన మిత్రులకు పిలుపునిచ్చారు. వీరిలో నటులు అల్లు అర్జున్, ఆర్య, ఆశిష్ చౌదరి, ‘జయం’ రవి కూడా ఉన్నారు. ఈ ప్రముఖ నటులంతా వారి భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ చాలెంజ్‌ విసిరారు. ఈ పోస్ట్‌లో పొందుపరిచిన వీడియోలో శ్రియ మాట్లాడుతూ.. నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. ఈ క్లిష్ట పరిస్థితిలో పెళ్లయిన మగవాళ్లు అందరూ వారి అందమైన భార్యలకు ఏ విధంగా సాయం చేస్తారో చూపించాలని నేను ఛాలెంజ్‌ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నాను. తమ అందమైన భర్తలు పనిచేస్తున్నప్పుడు తీసిన వీడియోను పోస్ట్ చేయండి అని శ్రియ తెలిపారు.

Related posts