telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ అబద్ధాల కోరు..సోదరి బ్యారీ విమర్శలు!

Trump sister

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆయన సోదరి మరియాన్నే బ్యారీ గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ ఓ అబద్ధాల కోరు అని, ఏమాత్రం విలువలు లేని వ్యక్తి అని బ్యారీ పేర్కొంది. ట్రంప్ మేనకోడలు మేరీ లియా రాసిన ఓ పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది. ఆ పుస్తకం రాసే సమయంలో మేరీ లియా… బ్యారీతో జరిపిన సంభాషణలు తాజాగా బయటకొచ్చాయి.

అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఏమాత్రం తగినవాడు కాదని బ్యారీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఆడియో టేపుల్లో వెల్లడి కాగా, ఆ టేపుల్లో ఉన్న సంభాషణలను ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం వేళ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ట్రంప్ ను కాస్త ఇబ్బందికి గురిచేయొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts