telugu navyamedia
సినిమా వార్తలు

ఎంతోమందిని స్టార్లను చేశావ్, నీకొడుకుని పట్టించుకోవా?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్‌ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే  పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఎంతోమందిని స్టార్లను నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్..   

అదే  నా కొడుకు అయితే నేను లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేవాడిని. నేను బతికేదే నా కొడుకుల కోసం.. అన్న నువ్వెక్కడున్నావో ఎంత బిజీగా ఉన్నవో తెలియదు ఇంకోసారి ఈ పని మాత్రం చేయకు.

అంతే కాదు వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కాని కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా కోసం. మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అన్నా అంటూ పూరీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.

‘చోర్‌బజార్‌’లో నీ కొడుకు అదరగొట్టేశాడు. నువ్వు చేసినా చేయకున్నా నీ కొడుకు స్టార్‌ అవుతాడు. నీ కొడుకు డేట్స్‌ కోసం నువ్వు క్యూలో నిల్చునే రోజు వస్తుంది అంటూ పూరీ జగన్నాథ్ ను ఉద్ద్యేశించి మాట్లాడారు బండ్ల గణేష్.

ఇక పూరీ భార్య గురించి మాట్లాడుతూ.. ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన వారిలో.. ఒక తల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు ఎలా ఉండాలి నాటే నేను లావణ్య గారిలా ఉండాలని చెప్తాను. నేను సీతా దేవిను చూడలేదు కానీ.. ఆవిడలో సహనం, ఓపిక లావణ్య గారికి ఉన్నాయి. పూరి అన్నతో నేను చేసిన ప్రయాణంలో చాలా ఎక్కువ షేర్ మా వదినకు ఇస్తాను. ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి.. అమ్మ కలకాలం ఉంటుంది.. జీవితాంతం ఆమెను కళ్లలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆకాష్, పవిత్ర, పూరి అన్నది. పూరి ఏదో పెద్ద డైరెక్టర్ అవుతాడు, భూమిని బద్దలు కొడతాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని ఆమె పెళ్లి చేసుకోలేదు. పూరి జేబులో వందో, రెండొందలో ఉంటాయి.. వీడు నచ్చాడు. నాకు కన్ను కొట్టాడు అని చెప్పి లవ్ చేసి, సనత్ నగర్ లో మూడు ముళ్ళు వేస్తే స్కూటర్ ఎక్కి వచ్చేసింది. తర్వాత చాలా మంది ఆయన స్టార్ అయ్యాకా వచ్చారు కానీ ముందు వచ్చింది మహాతల్లి మాత్రమే..అన్నారు.

అన్నా ఇప్పటికైనా నీ కొడుకుని చూడు.. వాడిపై దృష్టి పెట్టి స్టార్ ను చేయ్యి.. ఆకాశ్ పూరీ చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. అద్భుతంగా నటిస్తాడు.. ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటూ బండ్ల విష్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ పెద్ద మేధావి, ఆయనతో మాట్లాడుతుంటే నాకుభయమేసింది.. సినిమాను అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడారు బండ్ల.

Related posts