తెలంగాణ సీఎం కేసీఆర్ పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని, కరీంనగర్ నుంచే ఆయన పతనం ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో కూర్చొని జల్సాలు చేస్తున్న కేసీఆర్‌కు పోలీసులు గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు. తాను ఒక ఎంపీనన్న విషయం మరిచి కాలర్ పట్టుకొని దాడి చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై ప్రివిలైజేషన్ మోషన్‌ను మూవ్ చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసు అధికారులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు యునిఫామ్‌లు లేకుండా మఫ్టీలు, మాస్కులు వేసుకొని వచ్చి లాఠీచార్జీ చేయడం నిజాం నిరంకుశ పాలనను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. నిజాం పరమభక్తుడిలా తయారైన కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కే పరిమితం చేస్తామని వెల్లడించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ రుచి ఎలా ఉంటుందో ఆయనకు త్వరలోనే అర్థమయ్యేటట్లు చేస్తామని హెచ్చరించారు.
స్వచ్ఛమైన రాజకీయాలు చేశాం: పవన్ కల్యాణ్