telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్‌కు ప్రజలు త్వరలోనే చరమగీతం పడతారు -బండి

*మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్‌ మృతికి కారణం

*తెలంగాణ‌లో బీజేపీ కి ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం..
*ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీ వేసిన బండీ..

పోలీసుల వేధింపులతో పురుగుల మందు తాగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ మృతి తీరని లోటు అని బండి సంజయ్‌ అన్నారు.

పాదయాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, త్వరలోనే ప్రజలు చరమగీతం పడతారని దుయ్యబట్టారు. సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా బీజేపీ పార్టీ కార్యచరణ రూపొందించి కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

‘ఖమ్మం లోని స్థానిక మంత్రి చేసిన అవినీతి అడ్డుకొని ధర్మం కోసం నిబద్ధతతో పని చేసిన సాయిని వేధించి అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకుని విధంగా చేశారు. కండ కావరం తలకెక్కి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మీరు మనుషులు కాదు మానవ మృగాలు. బీజేపీని ఎదుర్కొలేక కార్యకర్తలను పోలీసుల చేత భయపెడుతున్నారు.. అలాంటి కొమ్ము కాసే పోలీసులను వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.

‘కేసీఆర్ ఫాంహౌజ్‌లో వాడే కరెంట్‌తో 10 గ్రామాలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయొచ్చు. కేసీఆర్‌ను గద్దె దించే దాకా నా పోరు ఆగదు. ఈ ప్రాంతంలో ఆసుపత్రి, కాలేజీ కూడా కట్టించలేని దద్దమ్మ కేసీఆర్.. కేసీఆర్ చేతగానితనం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు’ అని సంజయ్ విమర్శలు గుప్పించారు.

ఖమ్మంలో మంత్రి అరాచకాలు, టీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు సాయి గణేశ్ అనే బీజేపీ కార్యకర్తపై ఏకంగా 16 కేసులు పెట్టిండ్రు. ఇది దారుణం. రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని చూసార‌ని అన్నారు.

ఇవ్వాళ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం సంతోష్, అతని తల్లి.. స్థానిక మున్సిపల్ చైర్మన్ వేధింపులు భరించలేక చచ్చిపోతున్నామంటూ వీడియో పెట్టి లాడ్జిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు చావులకు ముమ్మాటికీ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలదే బాధ్యతని సంజయ్ అన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, సీఎం అంతు చూసేదాకా బీజేపీ పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు

Related posts