కరోనాను తరిమికొట్టేందుకు దేశ పౌరులంతా ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ పిలుపును అవహేళన చేసే విధంగా అసదుద్దీన్ మాట్లాడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపం పెట్టమంటే హేళన చేస్తావా? ‘నీకు సిగ్గుందా? జ్ఞానం ఉందా?’ అంటూ అసదుద్దీన్ పై విరుచుకుపడ్డారు. రాత్రి తొమ్మిది గంటలకు చార్మినార్ ఎక్కి చూడు, భారతీయుల దీపాలు ఎలా ఉన్నాయో తెలుస్తుందని హితవుపలికారు.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ