telugu navyamedia
ఆంధ్ర వార్తలు

క్యాసీనోల‌కు వెళ‌తాను.. పేకాటాడుతాను…డ్రామాల‌డ‌డం నాకు చేత కాదు..

*క్యాసీనోల‌కు వెళ‌తాను.. పేకాటాడుతాను…
*డ్రామాల‌డ‌డం నాకు చేత కాదు..
*చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసీనోకు.. నాకు సంబంధం లేదు..

క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వ‌హించిన ఈడీ అధికారులు ఆయన ఖాతాదారుల్లో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పేర్లలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఉంది .దీనిపై బాలినేని స్పందించారు. తాను ఎప్పుడైనా క్యాసినోకు వెళ్తానని.. పేకాట ఆడతానని, . అయితే చికోటి ప్రవీణ్‌తో కానీ.. హవాలా వ్యవహరాలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు

తాను ఉన్న విషయాలు ఒప్పుకుంటానని.. డ్రామాలు చేయడం తనకు రాదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనకు ప్రవీణ్‌తో సంబంధాలు వున్నాయని భావిస్తే ఎవరైనా విచారణ చేయొచ్చని బాలినేని స్పష్టం చేశారు. కావాలని టీవీలు, పేపర్‌లలో తన పేరు బయటకు తీసుకొస్తే మంచి పద్ధతి కాదన్నారు.

Related posts