balakrishna

బాలకృష్ణ వద్ద “ఏకే 47″…!?

19

సి కళ్యాణ్ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రానికి “ఏకే 47” అనే టైటిల్ ఖరారైందట. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర యూనిట్.  వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇంతకుముందు బాలయ్య, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన “చెన్నకేశవరెడ్డి” చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కన్నడ హిట్ మూవీ “మఫ్టీ”కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ చిత్ర బృందం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్”తో పాటే ఈ చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. మరి 15 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాల్సిందే…! ఇక మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.