బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

20

బాలయ్య అని అభిమానులు ముద్దుగా పిలిపించుకొనే నందమూరి బాలకృష్ణ నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కుమారుడు, ప్రముఖ తెలుగు సినిమా ప్రముఖ నటుడు, నిర్మాత. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు బాలయ్య పుట్టినరోజు… ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.balakrishna 6

బాలకృష్ణ 1960 జూన్ 10న చెన్నైలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకా రామరావు, బసవ తారకం దంపతులకు జన్మించారు. ఆ సమయంలో మద్రాసులో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆవిష్కరించినందున మద్రాసులో తన బాల్యమును గడిపాడు. హైదరాబాదులోని నిజాం కాలేజీ నుంచి అతను వాణిజ్యంలో బ్యాచులర్ డిగ్రీని పొందాడు. 1982లో 22 సంవత్సరాల వయస్సులో అతను వసుంధరా దేవిని వివాహం చేసుకున్నాడు. బాలకృష్ణ, వసుంధర దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు తారకరామ తేజ మోక్షజ్ఞ.

balakrishna 5

బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుమారుడు నారా రోహిత్ కు ఇచ్చి వివాహం చేశారు. అంతేకాదు ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు నాయుడుకు ఇచ్చి వివాహం చేశారు. కాబట్టి బ్రాహ్మణి, లోకేష్ ల పెళ్ళికి ముందుగానే వీరిద్దరూ బంధువులు.

balakrishna 8

బాలయ్య తన 14వ ఏట చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేశారు. 1974లో తాతమ్మ కల అనే చిత్రంలో మొదటిసారిగా నటించారు. బాలకృష్ణ 1984లో సాహసమే జీవితం, జననీ జన్మభూమి, మంగమ్మగారి మనవడు చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించారు. 1990లలో కమర్షియల్ గా విజయాన్ని సాధించారు బాలయ్య. అపూర్వ సహోదరుడు (1986), మువ్వా గోపాలుడు (1987), ముద్దుల మావయ్య (1989), నారీ నారీ నడుమ మురారీ (1990), లారీ డ్రైవర్ (1990), రౌడీ ఇన్స్పెక్టర్ (1992), అశ్వమేధం (1992), నిప్పు రవ్వ (1993), భైరవ ద్వీపం (1994), పెద్దన్నయ్య (1997), సమరసింహ రెడ్డి (1997) వంటి హిట్ చిత్రాల్లో నటించారు బాలయ్య. వీటిలో అనేక చిత్రాలకు అవార్డులు లభించాయి.

balakrishna 3

మరోవైపు బాలకృష్ణ బయోపిక్ లు, చారిత్రక చిత్రాలలో కూడా నటించారు. బాలయ్య 1976లో వేములవాడ భీమకవి చిత్రంలో భీమకవిగా, 1977లో దాన వీర శూర కర్ణలో అభిమన్యుడుగా, 1979లో అక్బర్ సలీం అనార్కలిలో జహంగీర్ గా, 1979లో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం నారద పాత్రలు పోషించారు. 1984లో మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన శ్రీమద్విరాత్ వీరబ్రహ్మెంద్ర స్వామి చరిత్ర చిత్రంలో సిద్ధ అనే పాత్రలో నటించారు. 1991లో ఆదిత్య 369లో కృష్ణదేవరాయగా నటించారు. ఈ చిత్రం భారతదేశం నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 1991లో బ్రహ్మశ్రీ విశ్వామిత్రలో సత్య హరిచంద్ర, దుష్యంతుడుగా, 1996లో శ్రీ కృష్ణార్జున విజయంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడుగా, 2008లో పాండురంగడులో, 2011లో శ్రీ రామరాజ్యంలో రాముడుగా నటించారు. ఈ చిత్రం భారతదేశం నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో స్పెషల్ మెన్షన్ నామినేషన్ పొందింది.

sreeramajyam

2017లో తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో నటించారు. ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఆ తరువాత హిందీ, తమిళ భాషలలోకి అనువదించబడింది. ఈ చిత్రం ముందుగా “ఎడిన్బర్గ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీ” లో ప్రదర్శించబడింది. 2001లో నరసింహ నాయుడు, 2010లో సింహా, 2014లో లెజెండ్ చిత్రాలలో బాలకృష్ణ నటనకుగానూ ఉత్తమ నటుదుగా మూడు రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు.

balakrishna 7

2014 లో అతను లెజెండ్ చిత్రంలో తన నటనకు గానూ ఉత్తమ నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును అందుకున్నారు. 43వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

balakrishna9

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఛైర్మన్ గా బాలకృష్ణ ఉన్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన శైలిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

balakrishna 4

ప్రస్తుతం ఎన్టీ రామారావు జీవితంపై నందమూరి బాలకృష్ణ కథానాయకుడు నటిస్తూ నిర్మిస్తున్న సినిమా “ఎన్టీఆర్ బయోపిక్”. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

balakrishna 10

విభిన్న కథానాయకుడు, నందమూరి నటసింహం, డైలాగ్ సింగ్ నందమూరి బాలకృష్ణకు నవ్యమీడియా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు…!

– విమలత