telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ హీరోతో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్

Gutta-Jwala

తమిళ హీరో విష్ణు విశాల్, ప్రముఖ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నట్టు చాలా మందికి తెలుసు. తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు జ్వాల ఇప్పటికే వెల్లడించారు. తాజాగా హీరో విష్ణు విశాల్ తో గుత్తా జ్వాల ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్వాల. జీవితానికి కొత్త ఆరంభం. ఆశావహ దృక్పథంతో ముందుకెళదాం. మనతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. మా కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ కావాలి. మా కోసం అర్ధరాత్రి సమయంలో ఉంగరం ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌ (జ్వాల మేనేజర్)కు ధన్యవాదాలు” అని విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు. “నూతన ఆరంభం” అంటూ జ్వాల కూడా ఆనందం వ్యక్తం చేసింది. గుత్తా జ్వాల జన్మదినోత్సవం నేడు (సెప్టెంబర్ 7). ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేసిన విష్ణు విశాల్.. తమ నిశ్చితార్థం గురించి కూడా వెల్లడించాడు. ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

&nbsp

Related posts