ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం ఆడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో చేరేందుకు ముంబైకి వెళ్లిన అక్షర్ పటేల్.. అక్కడే హోటల్‌లో ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ క్వారంటైన్‌కి వెళ్లే ముందు అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. కానీ.. క్వారంటైన్‌లో ఉండగా నిర్వహించిన రెండో పరీక్షలో అతనికి పాజిటివ్‌గా తేలింది. దాంతో.. బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమ్‌కు దూరంగా 14 రోజులు అక్షర్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అతను మళ్లీ టీమ్‌తో చేరాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులోకి తీసుకుంటే.. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్ లేదా లలిత్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది.
previous post