telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి

avanthi srinivas ycp

విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు గురివింద సామెతలా ఉన్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పోలవరం, పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో మహానాడులో సమీక్ష చేసుకోవాలన్నారు.

ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నారని, ఏడాదిలోనే 90శాతం హామీలను జగన్‌ అమలు చేశారని తెలిపారు. విద్యకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

Related posts