telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. పోరాడి ఆడినా.. 289 లక్ష్యాన్ని ఇచ్చింది ఆస్ట్రేలియా..

australia scored 288 runs

నేడు ప్రపంచ కప్ లో భాగంగా విండీస్ తో ఆసీస్‌ తలపడింది. బ్యాటింగ్ లో తడపడినా.. అద్భుతంగా పోరాడింది. ఒక్కో పరుగుతో ఇన్నింగ్‌ను జాగ్రత్తగా నిలబెట్టుకుంది. కౌల్టర్‌ నైల్‌(92; 60బంతుల్లో 8×4, 4×6), స్టీవ్‌ స్మిత్‌(73; 103బంతుల్లో 7×4) గొప్పగా ఇన్నింగ్స్‌ ఆడారు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.

మొత్తంగా విండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఒకవైపు విండీస్‌ బౌలర్లు విజృభించి కట్టడి చేస్తున్నా.. స్మిత్‌- కౌల్టర్‌ నైల్‌ జోడీ వారి బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొన్నారు. వీరి ధాటికి ఆసీస్‌ 49ఓవర్లలో 288పరుగులు సాధించింది. విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌ మూడు వికెట్లు, థామస్‌, షెల్డన్‌, రసెల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Related posts