telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆసీస్ క్రికెటర్‌కి కరోనా వైరస్…

australia

సిడ్నీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా తలపడనుండగా.. మ్యాచ్‌కి కొన్ని గంటల ముందు ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్‌కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో.. అప్రమత్తమైన టీమ్ మేనేజ్‌మెంట్ రిచర్డ్‌సన్‌ని జట్టుకి దూరంగా తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన రిచర్డ్‌సన్ గురువారం రాత్రి తన గొంతులో మంటగా ఉందని టీమ్ వైద్య సిబ్బందికి తెలియజేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మెడికల్ స్టాఫ్‌ రిచర్డ్‌సన్‌కి గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించింది. కానీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాల మేరకు అతడ్ని ఐసోలేషన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నాం. అలానే కరోనా వైరస్ నిర్ధారణ కోసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపాం. రిపోర్ట్‌లు వచ్చిన తర్వాతే ఏదైనా మాట్లాడగలం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున రిచర్డ్‌సన్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వేలంలో ఈ పేసర్‌ని రూ. 4 కోట్లు వెచ్చించి ఆర్సీబీ కొనుగోలు చేసింది.

Related posts