ప్రభుత్వ టెలీకాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయనుంది. 69వ విడత ఫ్యాన్సీ నంబర్ల ఈ-వేలాన్ని ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మొబైల్స్ నంబర్స్‌ను పూర్తిగా వెబ్ బేస్‌డ్ పద్ధతిలో ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం eauction. bsnl.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నంబర్లను ఎంచుకుని బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. అనంతరం ఫ్యాన్సీ నంబర్లను బిడ్డింగ్‌లో గెలుపొందిన వారికి కేటాయిస్తారు.
previous post