తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏయే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో, వాటి ఉచ్చులో పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. తాజాగా ఏటీఎం కార్డుల మోసాలపై పోలీసులు కొన్ని వాస్తవాల్ని చెబుతున్నారు.
సాధారణంగా ఏటీఎం కార్డులు మన దగ్గరే ఉంటాయి. కానీ మన కార్డుతో హ్యాకర్లు మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు దోచేస్తారు. మీ జేబులో ఏటిఎమ్ కార్డు వుందనుకొని రిలాక్స్ గా వుంటున్నారా, మిమ్మల్ని ముట్టుకోకుండా మీ ఏటిఎమ్ లో డబ్బులు దొంగాలిస్తారు. ఆన్లైన్ ట్రాంజక్షన్స్, కార్డు స్వైపింగ్ చేసేప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఏటీఎం కార్డు ను స్వైపింగ్ మిషన్ తో స్కాన్ చేసి డబ్బులు దోచే అవకాశముంది.
దళితులను అణగతొక్కాలని ప్రభుత్వం కుట్ర: చినరాజప్ప