ఏపీలో ఎన్నికల వేడి కొనసాహుతునే ఉంది. మొదట పంచాయతీ, మున్సిపల్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా తాజాగా తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లకి తుది గడువు ఇవ్వనున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే ఒరిగేది శూన్యమని..వైసీపీ గెలిస్తే 22 మంది గొర్రెలకు మరో గొర్రె కలుస్తుందని అచ్చెన్న ఫైర్ అయ్యారు. సింహాల్లా పోరాడుతున్న ముగ్గురు టీడీపీ ఎంపీలకు మరో ఎంపీని తోడివ్వాలని.. హోదా ఇవ్వను అని కేంద్రం చెప్తే.. ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై నోరెత్తే ధైర్యం కూడా చెయ్యడం లేదని.. స్థానిక ఎన్నికలు వేరు.. లోక్‌సభ ఎన్నికలు వేరని తెలిపారు. తెలంగాణలో స్థానికం గెలిచిన టీఆర్‌ఎస్… దుబ్బాక ఓడిపోలేదా ? దుబ్బాక లాగానే తిరుపతి ఫలితం ఉంటుందని అచ్చెన్నాయుడు జోష్యం చెప్పారు. ఒక్కశాతం ఓట్లు లేని బీజేపీ మేము గెలుస్తాం అనుకుంటే అనుకోవచ్చని.. తిరుపతి ఎన్నికలను మొత్తం పాలనకు రెఫరెండంగా చూడలేమన్నారు అచ్చెన్నాయుడు. ఓడిపోతేనే వైసీపీకి అధికార మదం దిగుతుందని..తిరుపతిలో మా ట్రాక్ రికార్డ్ బాలేదు అనేది అవాస్తవమన్నారు. ఇసుక నుంచి ప్రతి ఫెయిల్యూర్‌ను ఎన్నికల్లో ప్రచారం చేస్తామని అచ్చెన్నా పేర్కొన్నారు.
previous post
చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట హింస: విజయసాయిరెడ్డి