asylum-secrets

వెలుగులోకి వచ్చిన రాజకీ’యాశ్రమం’…

18

తిరుపతి దగ్గరున్న రామాపురంలో ఒక రహస్య ఆశ్రమం ను వెలుగులోకి తెచ్చింది ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. కేవలం విఐపి లు మాత్రమే ఇక్కడకి రావడం ఈ ఆశ్రమం గురించి ఎవరికి తెలియకపోవటానికి ముఖ్య కారణమేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాళ్ల గుట్టల్ల మధ్య రహస్యం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శ్రీ సీద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా.సుందరమైన పాలరాతి ఆలయం, చక్కటి అతిధి గృహాలు ఉన్న ఆశ్రమ ప్రాంగణంలోకి స్థానికులకు ప్రవేశం లేదు. ఏ సందడి లేకుండా ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం తలుపులు ఉత్తరాది ప్రముఖుల కోసం మాత్రమే తెరుచుకుని వెంటనే మూసుకుపోతాయి.

asylum-secrets

స్థానిక నాయకులే కాదు దక్షణాదికి చెందిన ఏ ప్రముఖులు ఈ ఆశ్రమాన్ని దర్శించినట్లు దాఖలాలు లేవు, అక్కడ అలాంటి ఆశ్రమం ఉందని స్థానిక నేతలలోను చాలా మందికి తెలీదు. అందులో ఉన్న స్వామి కి అంత ప్రచారం కూడా లేదు, అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని స్వామి వారిని దర్శనానికి తిరుమలకి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు ‘అమితాషా’ ఈ ఆశ్రమానికి వెళ్ళాడు, అదే సమయంలో అలిపిరి దగ్గర ‘అమితాషా ‘ కి టిడిపి కార్యకర్తలు నిరసనలు తెలిపిన సంగతి మీడియాలో హాల్ చల్ చేసింది కానీ ఆయన 45 నిమిషాల పాటు ఈ ఆశ్రమంలో గడిపిన విషయాన్ని బైటకు ఎక్కడ పొక్కలేదు. ఆయన కంటే ముందు కేంద్ర మంత్రులు ‘జె పి నడ్డా’, రవిశంకర్ ప్రసాద్ , ధర్మేంద్ర ప్రధాన్ , తదితర ప్రముఖులు ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్లారు.

asylum-secrets

తిరుపతి కి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉంది, ఇక్కడ పని చేసే వారంతా ఉత్తరాది వల్లే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గురువానంద స్వామి దర్శనం కోసం వచ్చే విఐపి భక్తులను మామిడి తోటలో ఉన్న హాల్ లో కుర్చోపెడుతారు. వారంతా 2 లేదా 3 గంటలు భజనలు చేస్తారు భక్తులు, తన్మయులై ఉన్న సమయంలో హఠాత్తుగా స్వామి ప్రవేశిస్తారు వేదిక పై అటు ఇటు తిరిగి భక్తులను ఆశిర్వదిస్తారు. ఒక్కొక్క సారి హిందీలో ప్రసంగిస్తారు, భక్తుల్లో కొందరిని వేదిక మీదకు పిలిచి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు, మరి కొందరికి కానుకలు సృష్టించి ఇస్తారని కూడా చెప్తున్నారు.