బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ బీసీలు దద్దమ్మలు కాదన్నారు.
బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని, వారి గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందని, మహాభారతం లౌక్యం నేర్పిస్తుందని అన్నారు. దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్ వేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని తమ్మినేని వ్యాఖ్యానించారు.
మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోంది: రాహుల్ గాంధీ