మంత్రి నారాయణ అసెంబ్లీ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై ప్రసంగించారు.
గత ప్రభుత్వం 22,640 మందిని తొలగించి వేరేవారికి ఇళ్లు కేటాయించింది. కేవలం 57,040 ఇళ్లనే వైసీపీ ప్రభుత్వం పూర్తిచేసింది. లబ్ధిదారుల మార్పుల అవకతవకలపై కమిటి వేసి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే , 77,606 ముందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై బ్యాంకు గుణం తీసుకున్నారు అన్నారు.
బ్యాంకులకు రుణాలు కట్టేందుకు సీఎం రూ.140 కోట్లకు అనుమతించారు అన్నారు.
త్వరలోనే బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తాం, టిడో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు హడ్కో రూ.4,460 కోట్లు రుణం ఇస్తుంది అని తెలిపారు.
అర్బన్ అథారిటీల సహకారంతో మౌలిక వసతుల కల్పన పూరికి చర్యలు చేపట్టాము అని అన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్లో ఉన్న 365, 430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తిచేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు.