telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ సినిమాలకు ఎన్నికల ఎఫెక్ట్ ?

Tollywood

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇకనుంచి అందరి దృష్టి రాజకీయాలపైనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పటికే మీడియాల్లో డిబేట్లు కూడా మొదలయ్యాయి. ఈ ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై గట్టిగానే పడేలా కన్పిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు వేసవిలో వరుసగా విడుదలవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెద్ద సినిమాల హడావుడి అంతగా కన్పించడం లేదు. మహేష్ బాబు “మహర్షి” మే 9న అంటే ఎన్నికల తరువాతే వస్తుంది. కాబట్టి “మహర్షి”పై ఈ ఎఫెక్ట్ అంతగా ఉండదనే చెప్పాలి.

కానీ మీడియం సినిమాల వసూళ్లకు మాత్రం ఎన్నికల ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలవుతుందా ? లేదా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక మజిలీ, సీత, జెర్సీ, కాంచన-3 లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల హడావుడిలో పోలింగ్ కారణంగా సినిమాల వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు సినిమా విశ్లేషకులు. మరోవైపు ఐపీఎల్ కూడా మొదలవుతుంది. అయితే నిర్మాతలు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా సినిమాల విడుదలకు సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related posts