యాషెస్ సిరీస్ లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 135.5 ఓవర్లలో 374 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్స్ (312 బంతుల్లో 133 పరుగులు, 17 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లయాన్‌లు చెరో 3 వికెట్లు తీశారు.
జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.