మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రావడంలేదని, గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
మహారాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమున్నా తమ పార్టీ వారికి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన విధిస్తే అది బీజేపీకి ఉపకరిస్తుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. .అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలు గెలుచుకుందని అసదుద్దీన్ తెలిపారు.
వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు: నారా లోకేశ్