BREAKING NEWS:
asaduddin at a ramjan celebration meeting3

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్…దేశానికి మేలన్నాడా..?

72

హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ నిన్న ఒక రంజాన్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు తమ హక్కులను కాపాడుకోడానికి రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు.

నిన్న అసదుద్దీన్ మక్కా మస్జీద్ రంజాన్ సందర్భంగా వేడుకలలో మాట్లాడుతూ ఎంఐఎం ఇక మీదట కూడా ఎన్నికలలో పాల్గొంటుందని, త్వరలో దేశం అంతా పార్టీని విస్తరిస్తామని చెప్పారు.

అయితే ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయాలనుకుని కూడా చివరి నిముషంలో విరమించుకున్నట్టు చెప్పారు, పోటీని విరమించుకున్న కూడా ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (సెక్యూలర్) కు మద్దతు ఇచ్చామని ఇందుకు గాను వారు పదవిని ఇవ్వబోయిన వద్దనుకున్నట్టు అసదుద్దీన్ అన్నారు.

asaduddin at a ramjan celebration meeting

 

ఎవరిని నమ్మినా కాంగ్రెస్ ను మాత్రం నమ్మొద్దని, కాంగ్రెస్ పని అయిపోయిందని, అక్కడ కాంగ్రెస్ లో 50 ఆ పార్టీ కోసం పని చేసిన వారికే విలువ లేక పక్క పార్టీలవైపు చూస్తున్నారని ప్రణబ్ ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమానికి హాజరైన సందర్భాన్ని గురించి చెపుతూ అసదుద్దీన్ అన్నారు.

దేశంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కు ప్రత్యామ్న్యాయం కావాలని ఒవైసి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ ఈరెంటికి సమాధానమని ఒవైసి అన్నాడు.

asaduddin at a ramjan celebration meeting

ఈ సందర్భంగా అసదుద్దీన్ దేశంలో పెరిగిన ముస్లింలపై దాడులను గురించి కూడా ప్రస్తావించారు. ఆవు పేరు చెప్పి ముస్లిం ల మృతికి కారణం అవుతున్నారని బీజేపీని విమర్శించారు. ఇంకా మతపరమైన అల్లర్లు దేశంలో 8,890 జరగగా 390 మంది మృతి చెందగా 9 వేల మంది గాయాలపాలయ్యారు.

asaduddin at a ramjan celebration meeting

బీజేపీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక పాలన చేస్తుందని అసదుద్దీన్ విమర్శించారు. వారి చేష్టలు ముస్లిం లను వేరే వెళ్ళాలి అన్నట్టుగా ఉన్నాయని, అది దేశానికి మంచిది కాదని ఒవైసి అన్నారు.

ఇన్ని చేస్తున్నా ప్రధాని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం వింతగా ఉందని వారు అన్నారు. ఇలాగే ముస్లింలపై దాడులు కొనసాగితే అది చట్ట వ్యతిరేక చర్య అవుతుందని ఒవైసి అన్నాడు.