telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆసుప‌త్రుల్లో పడకలకు కొరత లేదు: కేజ్రీవాల్

arvind-kejriwal

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ఇటీవ‌ల తగ్గుముఖం పట్టాయి. తాజాగా చేసిన పరీక్షల్లో మ‌ళ్లీ కేసుల ఉద్ధృతి అధికం అవుతోంది. దీనిపై సీఎం కేజ్రీవాల్‌స్పందించారు. తాము ఢిల్లీలో కరోనా పరీక్ష‌ల సంఖ్య‌ పెంచడం వల్లే పాజిటివ్‌ కేసుల సంఖ్య‌ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. దీనికి ప్రజలెవరూ భయపడక్కర్లేదని అన్నారు.

కరోనాపై తాము యుద్ధం ప్రకటించామ‌ని కేజ్రీవాల్‌ తెలిపారు. పరీక్షల సంఖ్య‌ను రెట్టింపు చేస్తున్నామ‌ని చెప్పారు. కరోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని ఐసోలేషన్‌ చేసి, వారికి చికిత్స అందిస్తున్నామ‌ని అన్నారు.

కరోనా వల్ల త‌లెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు త‌మ స‌ర్కారు స‌న్న‌ద్ధంగా ఉంద‌ని కేజ్రీవాల్‌ తెలిపారు. కొవిడ్ మ‌ర‌ణాలను తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామ‌ని చెప్పారు. ఆసుప‌త్రుల్లో పడకలకు కొరత లేదని, 14,000 పడకలు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

Related posts