దేశవ్యాప్తంగా కరోన వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఢిల్లీలో 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటన చేశారు. కరోనా విజృంభణ అంశం మన చేతుల్లోంచి జారి పోకుండా చేసుకోవడమే అతి పెద్ద సవాలని ఆయన అన్నారు.
వివిధ ఆసుపత్రుల నుంచి ఐదుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఇది అంతగా సంతోషపడాల్సిన విషయం కాదు. పరిస్థితులు మన చేతి జారి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఢిల్లీలో విదేశీయుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.