telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడు కోనసీమ జిలాల్లో సీఎం జగన్ పర్యటన : జనసేన పార్టీ నాయకుల అరెస్టు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. జిలాల్లోని పలు లంకల గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి.

ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. అక్క‌డ సీఎం వైఎస్‌ జగన్‌ వరద బాధితులను పరామర్శించనున్నారు.

అయితే జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు.

కాగా వరద బాధితులకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రికి పార్టీ తరుపున వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే నిరసనకు దిగుతామని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

Related posts