arjun tendulkar to under 19

అండర్ 19 జట్టులోకి అర్జున్ టెండూల్కర్

145

వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే అండర్ 19 క్రికెట్ మ్యాచ్ లకు భారతదేశం తరుపున అదే జట్టులోకి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎంపిక అయ్యారు. రెండు టెస్ట్ మ్యాచ్ లు ఐదు వన్డే మ్యాచ్ లని ఇండియా ప్రత్యర్థి ఐలాండ్ తో తలపడపోతుంది. ఇండియా అదే రెండు టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే అర్జున్ సెలెక్ట్ కాబడ్డారు.

ఢిల్లీ యొక్క అనుజ్ రావత్ టెస్ట్ మ్యాచ్ లకు సారత్యం వహిస్తుండగా, ఆర్యన్ జుయల్ వన్డే మ్యాచ్లకు కెప్టెన్ గా ఉండబోతున్నాడు, 18 సంవత్సరాల అర్జున్ గత వారం ధర్మశాలలో జరిగిన అండర్ 19 పోటీల్లో పాల్గొన్నాడు. అర్జున్ తండ్రిలాగె అల్ రౌండర్, స్పిరిట్ అఫ్ క్రికెట్ గ్లోబల్ ఛాలెంజ్ ఆస్ట్రేలియా లో జాగిన మ్యాచ్ లో అర్జున్ 27 బంతుల్లో 48 పరుగులు చేశారు, ముంబై అండర్ 14 అండర్ 19 లో కూడాగతంలో అర్జున్ తన ప్రతిభ కనబర్చారు.

చివరి సీజన్ లో జరిగిన కూచ్ బీహార్ ట్రోఫీ లో 6 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు ఆడాడు. అందులో 18 వికెట్లు 94 పరుగులు చేశారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అర్జున్ కు యువ క్రికెటర్లలో చాలా ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని సచిన్ అభిమాలనులు అభిలషిస్తున్నారు.