telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఇంగ్లాండ్ టీం తో .. కలిసి అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్ …

arjun tendulkar practice with england team

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో తనదైనాశైలిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. భారత అండర్-19 జట్టు సభ్యుడిగా అంతర్జాతీయ పర్యటనల ద్వారా అనుభవం సంపాదించుకుంటున్నాడు. అయితే అర్జున్ తన స్వస్థలం అయిన ముంబయి కంటే లండన్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. లండన్ అర్జున్ అమ్మమ్మ గారిల్లు. సచిన్ అర్ధాంగి అంజలి తల్లి ఓ బ్రిటీష్ వనిత. ఈ చుట్టరికంతో అర్జున్ తరచుగా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంటాడు.

వరల్డ్ కప్ లో ఏకంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసిపోయి ప్రాక్టీసు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ ను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అర్జున్ నెట్స్ లో సహకరిస్తున్నాడు. ఎడమచేతివాటం అర్జున్ మంచి ఫాస్ట్ బౌలర్. ఇంగ్లాండ్ కోచ్ ఆధ్వర్యంలో సాగిన ప్రాక్టీసు సెషన్ లో అర్జున్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అర్జున్ ఇంగ్లాండ్ జట్టు నెట్స్ లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న వేళ కూడా అర్జున్ తన బౌలింగ్ తో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ కు ప్రాక్టీసు అందించాడు.

Related posts