telugu navyamedia
రాజకీయ వార్తలు

వైద్య సిబ్బంది మరణిస్తే కోటి నష్టపరిహారం: సీఎం కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సేవలందించే క్రమంలో వైద్య సిబ్బంది మరణిస్తే వారి కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో మరణించినవారికి నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు.

కోవిడ్-19 బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడే పారిశుద్ధ్య సిబ్బంది కనుక మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఈవిధంగా వారికి నష్టపరిహారం ఇవ్వడమంటే వారి సేవలను గౌరవించినట్టు అవుతుందని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు ఎవరికైనా ఈ నష్టపరిహారం వర్తిస్తుందని చెప్పారు.

Related posts