BREAKING NEWS:
apricot benefits

ఆరోగ్య ఫల ప్రదాయిని నేరేడు పండు… 

149
 ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా లాభించే  ఆహార పదార్థాలు ఎంచుకుంటే సరిపోతుంది.  అలంటి  పండ్లలో నేరేడు ఒకటి. ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల  గని. ఆరోగ్య నివారిణి  నేరేడు  శక్తినందించి ఆరోగ్యానికి మేలుచేయడమే  కాదు. కొన్ని  రోగాలను నియంత్రించే శక్తి నేరేడు పండు సొంతం. ఇందులో విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో  పుష్కలం.  ప్రతి 100 గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07 శాతం కొవ్వులు,  0.3 ఖనిజాలు, 0. 04  నారం  పిండి పదార్థాలు, 15 మీ.గ్రా, ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2 , విటమిన్ సి 18 మీ.గ్రా ఉంటాయి.  
 
డయాబెటిక్ మంచిది:-
 నేరేడు పండులో అతి తక్కువ   గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబిటికు రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు,  సాధారణంగా  వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం  తరచూ ఉరినేషన్  వంటి లక్షణాలను నివారిస్తుంది.  ఇది మధుమేహ బాధితులకు వరంలా  పనిచేస్తుంది.
 
గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది:-
నేరేడు పండులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది.  100 గ్రాముల పండులో  55 గ్రామూల  పొటాషియం ఉంటుంది.  ఆరోగ్యకరమైన ఆహరం తీసుకొనే వారీలో  కొన్ని పోషకాహారాల  లోపం వల్ల   గుండె జబ్బలకు కూడా  దారి తీస్తుంది.   కాబట్టి  యాంటీ   అక్సిడెంటల్స్ పుష్కలంగా ఉండే  ముదురంగు  ఆహారాలైన నేరేడు పండ్లు  మరియు టమోటో వంటి పండ్లను  తరచుగా తీసుకోవడం  వల్ల   గుండెను ఆరోగ్యాంగా  ఉంచడానికి  దోహద పడుతుంది.   ఈ పండులోని యాంటీ యాక్సిడెంట్లు  మెదడుకు, గుండెకు  ఔషదంగా పనిచేస్తాయి.. 
 
దంత  సమస్యలను  నివారిస్తుంది:-
నేరేడు పండ్లలో  ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాల వల్ల దంత  సమస్యలను  నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్ళను తీసుకొనే వారిలో  దంతాల చిగుళ్లు బలంగా ఉంటాయి.  ఆకుల్ని దంచి కషాయం చేసి  పుక్కిలిస్తే దంతాలు కదలడం,  చిగుళ్ల వాపులు  తగ్గటానికి,   పండు  నమిలి నీళ్లతో  పుక్కిలించి  ఉమ్మి వేస్తే  నోటి  దుర్వాసన  తగ్గుతుంది.  
 
చర్మ సంరక్షణ:-
స్కిన్  రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది.  నేరేడు గింజలను పౌడరు చేసి, ఆ పౌడరును పాల్లో  మిక్స్ చేసి ముఖానికి రాసి   ఉదయం శుభ్రాంగా కడిగితే మొటిమలు నివారించవచ్చు. 
 
రోగ నిరోధక షాట్ శక్తిని పెంచుతుంది:-
నెరేడ్ పండు శక్తివంతమైన యాంటీ అక్సిడెంటుగా పనిచేయడమే కాకా, రోగ నిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి .  వీఏటిలో ఉండే క్యాల్షియం , ఐరన్, పొటాషియం, మరియు విటమిన్- సి  శరీరానికి  గొప్పగా సహాయపడి, శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది:-
నేరేడులో విటమిన్-ఏ, సి వంటి పోషకాలుంటాయి.  ఇవి కళ్ళు, చర్మం ఆరోగ్యాన్నీ కాపలాడేందుకు ఎంతో దోహద పడుతాయి. 
 
ఎముకలను బలంగా  ఉంచుతుంది:-
నేరేడు  పండ్లలో  ఉండే క్యాల్షియం,ఐరన్, పొటాషియం , విటమిన్స్- సి శరరీరానికి  చాల గొప్పగా  సహాయపడి, శరీరంలో ఎముకలు బలంగా  ఉండేందుకు దోహద పడుతుంది.  
 
శ్వసకు సంబందించిన సమస్యలు దూరం:-
ఆస్తమా, బ్రోన్కైటీస్  వంటి  చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది.   క్రోనిక్ దగ్గును నివారిస్స్తుంది.   దీర్ఘ కాలంగా ఉన్న శ్వాస  సంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్ళు తరచుగా తీసుకుంటే  వ్యాధి నిరోధక శక్తి పెరిగి శ్వాస సంబంధ రోగాలు దూరం అవుతాయి. 
 
హిమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి:-
అన్నమాలయ యూనివర్సిటీ అధ్యనం ప్రకారం ఈ నేరేడు పండ్లు శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుందని  నిర్ధారించారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్  ఈ రెండు  అత్యంత  ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యాంగా ఉండటానికి బాధ్యత కలిగిన  న్యూట్రిషన్స్.  
 
డయేరియా:-
నేరేడు ఆకులను ఆయర్వేద చికిత్సల్లో  విరివిగా  ఉపయోగిస్తున్నారు. వీటిలోని వైద్య  పరమైన గుణాల వల్ల ఇది డయేరియా మరియు అల్సర్ వంటిజబ్బులను నివారిస్తుంది.  
 
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది:-
వేడి ప్రభావానికి కడుపులో గ్యాసు చేరి ఏమి తిన్న జీర్ణం కానట్టుగా  అనిపిస్తుంది. ఓక్కోసాగారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది.  ఇలాంటప్పుడు నాలుగైదు  నేరేడు పళ్ళను తింటే  ఉపశమనం  కలుగుతుంది.  జీర్ణశక్తిని  పెంపొందించడమే కాకుండా  ఒంట్లోని  వేడిని తగ్గిస్తుంది.  నేరేడు ఫలాల్లో  బ్లాక్ సాల్ట్ మరియుజీలకర్ర పౌడర్  తీసుకొంటే ఎసిడిడిటి త్తగ్గిస్తుంది. 
 
మూత్ర సంబంధ సమస్యలకు:-
మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి ముందుగా పని చేస్తుంది.  మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు,  నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు.  అవి మూత్ర విసర్జన  సాఫీగా  అయ్యేలా చూస్తాయంటున్నారు. ఇన్ని ఔషధ గుణాలున్న నేరీడు ఫలాను తీసుకొంటే  ఆరోగ్యం  వ్యాధుల బారినపడకుండా ఎంతో దోహద పడుతుంది