telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

డిగ్రీ నాలుగేళ్లు..ఇంజనీరింగ్ ఐదేళ్లు..అనుభవంతో బయటకు..

ap logo

ఇప్పటివరకు ఉద్యోగ అవసరాల మేరకు మూడేళ్ళ డిగ్రీ, నాలుగేళ్ళ ఇంజనీరింగ్ విద్య అమలులో ఉంది. కానీ, పరిశ్రమలలో అవసరాల మేరకు అదే డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యను మరో ఏడాది పెంచే యోచనలో ఉన్నారు. ఇప్పటివరకు చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం పొందాలనే ఆలోచన తప్ప, చదివిన దానికి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి సంఖ్య చాలా తక్కువ. ఆ సమస్యను నివారించేందుకు ఆయా చదువుల కాలపరిమితి మరో ఏడాది పెంచి, అందులో ఒక ఏడాది పని అనుభవం పొందేట్టుగా విద్య శాఖ అడుగులు వేస్తుంది. దీనితో ఎవరి చదువులకు తగినట్టు వారు ఉద్యోగాలు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని సమూలంగా మరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాధమిక విద్యా బోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించాలనుకుంటున్న సర్కార్ ఇపుడు ఉన్నత విద్యావిధానంలోనూ మార్పులు చేయలనుకుంటోంది. దాని కోసం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే నాలుగేళ్ళకు డిగ్రీ కోర్సుని పెంచారు.

దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి డిగ్రీ నాలుగేళ్ళు, ఇంజనీరింగ్ కోర్స్ అయిదేళ్ళు ఉంటాయన్నమాట. డిగ్రీ మూడేళ్ళు, ఇంజనీరింగ్ నాలుగేళ్ళు పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా ఒక ఏడాది పాటు అప్రెంటిష్ షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యా మండలి తీసుకువస్తోంది. చదువు పూర్తి అయిన తరువాత చాలా మందికి వెంటనే ఉద్యోగాలు రావడంలేదు. దాంతో విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దడానికే ఉన్నతవిద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తి అయి బయటకు వచ్చే విద్యార్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఉద్యోగం దొరకాలంటే ఖచ్చితంగా అప్రెంటీస్ షిప్ అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దాని ప్రకారమే ఇపుడు డిగ్రీ కోర్స్ \నాలుగేళ్ళకు మారిపోయింది. ఇంజనీరింగ్ కూడా అంతే. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యాబోధన అప్రెంటీస్ షిప్ లో ఉండేలా చూస్తారని అంటున్నారు. అంటే నాలుగేళ్ళు చదువుకుంటే ఆ వెంటనే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందన్న భరోసా విద్యార్ధికి ఇకపై ఉంటుందన్నమాట. ఇది మంచి నిర్ణయమేనని మేధావులు కూడా అంటున్నారు.

Related posts