apcm plans air service from vijayawada to Singapore

విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు!

23

విజయవాడ నుంచి సింగపూర్‌కు త్వరలో నేరుగా విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్విట్టర్‌లో వెల్లడించారు. సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ మధ్య గురువారం జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. అమరావతిలో స్టార్టప్‌ ప్రాంతం ‘ఫేజ్‌ జీరో’ అభివృద్ధిపై సమావేశంలో వీరు చర్చించారు.

విజయవాడ-సింగపూర్‌ మధ్య విమాన సర్వీసులు నడిపే అంశంపై కూడా చర్చించారు. గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను ఆయనకు వివరించగా, ఈ మేరకు నెల రోజుల్లో విజయవాడ నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ సర్వీసుల్ని నడపుతామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హామీ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. .