telugu navyamedia
రాజకీయ

గవర్నర్ ప్రసంగంపై.. చంద్రబాబు సమాధానం..

నేడు ఏపీ సభలో.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు. పేదరికం రూపుమాపడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండేళ్లు వరుసగా నెంబర్ వన్ లో రాష్ట్రం ఉండగా, మరోసారి రెండవ స్థానంలో ఉన్నామని ఆయన చెప్పారు. వరుసగా రెండుసార్లు మొదటి స్థానంలో ఉండటాన్ని ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. విదేశీ పెట్టుబడులు సాధించడంలో కూడా రాష్ట్రానిదే పైచెయ్యి, ప్రభుత్వ కార్యక్రమాల అన్నిటిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. పసుపు కుంకుమ రాష్ట్రం మొదలుపెట్టింది, ఈ పథకం కింద ఈసారి 10వేలు ఇచ్చాము. 94 లక్షల మందికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బీసీ లకు అగ్రప్రాధాన్యత ఇచ్చింది, సంక్షేమ పథకాలను ఇచ్చింది ఏపీ ప్రభుత్వమే. ఒక్క బీసీ కోసమే 20 కార్పొరేషన్ లు ఏర్పాటు చేశాము. అలాగే అగ్రవర్ణాలకు కూడా న్యాయం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. కేంద్రం ప్రకటించిన ఈబీసీ రిజర్వేషన్ 10 శాతంలో 5 శాతం కాపులకు ఇస్తున్నాము. కాపుల ఆశలను నిజం చేసింది టీడీపీ మాత్రమే.

ఈ ఏడాది వ్యవసాయంలో 17.8 శాతం వృద్ధి సాధించాము. వ్యవసాయంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. కడప జిల్లాను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేస్తాము. ఏపీకి జీవనదిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 64 శాతం పూర్తిచేశాము. డిసెంబర్ నాటికి పోలవరం పనులన్నీ పూర్తిఅవుతాయి. జూన్ నెల నుండి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తున్నాము. రెండవ డిపిఆర్ కి కేంద్రం అనుమతి జారీచేయాల్సి ఉంది. ఆమోదించని పక్షంలో 11న ఢిల్లీలో ధర్నా చేస్తాము. ఆమోదం లభించేవరకు పోరాటం ఆపేదిలేదు.

వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలకు అగ్రస్థానం ఇస్తున్నాము. గతంలో సీఎంగా పనిచేసినప్పుడు వోక్స్ వ్యాగన్ తెస్తే, ఆ తరువాతి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వలన అది పూణెకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కియా నేను తీసుకువస్తే, అదికూడా కేంద్రం చలవేనని బీజేపీ చెప్పుకు తిరగటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

Related posts