telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ క్లారిటీ…

cm jagan ycp

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో చాలా రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేస్తున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్న ఆయన ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని ఆదేశించారు. అలానే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలని, గతంలోలా వార్డులలో ప్రత్యేక మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయండని ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌ పర్యవేక్షణ బాధ్యత జిల్లాలో ఒక జేసీకి అప్పగించాలని ఆదేశించారు. ఇక మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts