telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రీపోలింగ్‌కు సర్వం సిద్దం: ద్వివేది

election commissioner faced evm issue

ఏపీలో ఈ నెల 6న నిర్వహించనున్న రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళంలో వర్షాలు వల్ల స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత పెంచామని, భారీ వర్షాలు వచ్చినా ఈవీఎంలు తడిచే అవకాశం లేదన్నారు.6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందని వెల్లడించారులక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు మీడియాలో చూశామని, ఆ కేసు ప్రస్తుతం తమ పరిధిలో లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టారన్న వ్యాఖ్యలపై కలెక్టర్‌, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ విచారణ చేస్తున్నారని, జేసీపై చర్యలు తీసుకునే హక్కు కలెక్టర్‌కు ఉంటుందని ద్వివేది చెప్పారు.ఇటీవల ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చుపై దివాకర్‌రెడ్డి తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాయని, అభ్యర్థులు రూ.25కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చు అయిందని చెప్పడంతో చిక్కుల్లో ఇరుక్కుపోయారు

Related posts