telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీకి షాక్…బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు

వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై విచారణ జరపాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగానే మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్‌ కార్యాలయానికి రాజ్యాంగ బద్ధ సంస్థ అధిపతిగా ఉన్న తాను రాసిన లేఖను బయటకు లీక్‌ చేయడమనేది హక్కులకు విరుద్ధమని, ఇలాంటి చర్యలు మంచివి కావని పేర్కొంటూ నిమ్మగడ్డ శనివారం హైకోర్టులో పిటీషన్‌ వేశారు. దీంట్లో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు గవర్నర్‌ కార్యదర్శని ప్రతివాదులుగా చేర్చారు. అటు నోటీసులపై మంత్రి బొత్స స్పందించారు. కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. నిమ్మగడ్డకు సంబంధించిన రహస్యం ఏం బయటకు వచ్చిందో తనకు తెలియదని పేర్కొన్నారు బొత్స.

Related posts