telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు.. ఎందుకంటే..?

చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ అన్ని దేశాలతో పతిగా మన దేశాన్ని కూడా అతకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ కారణంగా ఇప్పటిఅరకే చాలా మంది మరణించారు. అయితే కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న కొందరు పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. వారికి పునరావాసం కల్పించే చర్యలు చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చాలా మంది పిల్లలను చేరదీసి, వారికి జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. ఇందుకోసం 181, 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించి రక్షణ, పునరావాస సేవలు పొందవచ్చన్నారు. ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు ప్రజలు.

Related posts