telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన ఏపీ ఆర్థిక మంత్రి.

కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్లో కీలక సూచనలు చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల.

కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను జీఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన పయ్యావుల.

ఏపీలో ప్రభుత్వం మారాక జాతీయ స్థాయిలో పాజిటివ్ టాక్ వినిపిస్తోందని పయ్యావులకు చెప్పిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు.

కేశవ్ ఇచ్చిన కీ-నోట్ ప్రసంగానికి ఇతర రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల నుంచి ప్రశంసలు.

రాష్ట్రానికి ఏం కావాలో ప్రజెంట్ చేస్తూనే.. వివిధ రంగాల్లో జీఎస్టీ కౌన్సిల్ అనుసరించాల్సిన విధానాలను చక్కగా చెప్పారన్న వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు.

పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేసిన జీఎస్టీ కౌన్సిల్.

తాను చేసిన సూచనలపై వెంటనే మంత్రి వర్గ ఉప సంఘం వేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్థిక మంత్రి పయ్యావుల.

పయ్యావుల కేశవ్ వెంట జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు.

పయ్యావుల కేశవ్, ఏపీ ఆర్థిక మంత్రి

5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణపై ఒక్క శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలి.

దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతాం.

2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారు.

ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి.

పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలి.

ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలి.. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలి.

చిన్న వ్యాపారస్తులు.. కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం-RCM నుంచి మినహాయింపు ఇవ్వాలి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలి.. అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలి.

Related posts