telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ సర్కార్ .. జీతాలు మినహ ఇతర చెల్లింపులు నిలిపివేత!

ఏపీ సర్కారు పెండింగ్ బిల్లుల చెల్లించేందుకు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు మినహ ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో విశాఖ జిల్లాలో పలు శాఖలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ట్రెజరీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున బిల్లుల చెల్లింపు కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఎన్నికల సమయం నుండి అద్దెకు తీసుకొన్న కార్ల బకాయిలు కూడ చెల్లించని పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు నిధులను ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఆదాయానికి, ఖర్చుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీంతో కేవలం వేతనాలు, పెన్షన్లను చెల్లించేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది.

Related posts