telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

Corona

ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 95,327 శాంపిల్స్ పరీక్షించగా 4,250 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 33 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 5,570 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036 కి చేర‌గా.. యాక్టివ్ కేసులు 44,773 గా ఉన్నాయి.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 18,19,605 క‌రోనా నుంచి కోలుకోగా 12,599 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,17,32,933 కు చేరింది.

Related posts