ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్యారిస్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు మంత్రి జోగి రమేష్, సీఎస్ తలశిల రఘురాం తదితరులు ఘన స్వాగతం పలికారు.
గత నెల 28వ తేదీన సీఎం వైఎస్ జగన్ పారిస్‌కు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్యారిస్ లోని తన కుమార్తె హర్షా రెడ్డి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఈ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ , భారతి దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం తన కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విటర్లో ట్వీట్ చేశారు.
డియర్ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్‌లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా అని అన్నారు.
Congrats Harsha 🏅🎉 https://t.co/6aGMm6kGfa
— Roja Selvamani (@RojaSelvamaniRK) July 2, 2022
రేపు ప్రధాని మోదీ రాజమహేంద్రవరానికి రానున్నందున ఆ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
బీజేపీలో కలిసిపోవాల్సిందే అంటున్నాడు తుగ్లక్: బుద్ధా వెంకన్న