ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 3.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు.
బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.