ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళగిరి ఎయిమ్స్ పర్యటన నేపధ్యంలో మాట్లాడారు.
ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ప్రకటించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపదీ ముర్ము ను ఒక ఆదర్శంగా విద్యార్థులు తీసుకోవాలని.
ఒక ఆదివాసి కుటుంబం నుంచీ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడం ఆవిడ సాదించిన విజయం అని తెలిపారు.
కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అనడానికి ద్రౌపదీ ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు.
ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ప్రకటించారు దేశంలో ఏ ఎయిమ్స్ కు కూడా అలాంటి భూమి లేదు అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నెంబర్ 1 అవుతుందన్నారు. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి… 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ అని వివరించారు డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారని పేర్కొన్నారు.